Thursday, December 26, 2024
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌లో 17 ఇస్కాన్ అకౌంట్లు సీజ్‌

బంగ్లాదేశ్‌లో 17 ఇస్కాన్ అకౌంట్లు సీజ్‌

Date:

బంగ్లాదేశ్ అధికారులు ఇస్కాన్‌తో లింకున్న 17 అకౌంట్ల‌ను 30 రోజుల పాటు ఫ్రీజ్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. మాజీ స‌భ్యుడు చిన్నయ్ కృష్ణ‌దాస్‌ను దేశ‌ద్రోహం కింద అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఇంట‌ర్నేష‌న‌ల్ సొసైటీ ఫ‌ర్ కృష్ణ కాన్సియ‌స్‌నెస్‌ను బ్యాన్ చేయాల‌ని దాఖ‌లైన పిటీష‌న్‌ను బంగ్లాదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఇస్కాన్‌కు చెందిన బ్యాంక్ అకౌంట్ల‌ను సీజ్ చేయాల‌ని కోరుతూ వివిధ బ్యాంకుల‌ను బంగ్లాదేశ్ ఫైనాన్సియ‌ల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆదేశించింది. అక్టోబ‌ర్ 30వ తేదీన కృష్ణ‌దాస్‌తో పాటు మ‌రో 19 మందిపై చాటోగ్రామ్ కొత్వాల్ పోలీసు స్టేష‌న్‌లో దేశ‌ద్రోహం కేసు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. చాటోగ్రామ్ మార్కెట్ ప్రాంతంలో హిందువులు ర్యాలీ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవ‌మానించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఢాకాలోని హ‌జ్ర‌త్ షాజ‌లాల్ ఎయిర్‌పోర్టులో దాస్‌ను అరెస్టు చేశారు. బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించారు.