బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోన్న నేపథ్యంలో హిందువుల భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం వేలాదిమంది వీధుల్లోకి వచ్చారు. చటోగ్రామ్‌లో సనాతన జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. అలాగే మహ్మద్ యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం పలు డిమాండ్లు ఉంచారు. ఈ మేరకు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఈ క్రమంలో తాత్కాలిక ప్రభుత్వం ముందు ఎనిమిది డిమాండ్లు ఉంచారు. వాటిని నెరవేర్చేవరకు వీధుల్లో తమ నిరసన కొనసాగుతుందని కొందరు హిందూ ఉద్యమకారులు పేర్కొన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొద్దినెలల క్రితం బంగ్లాలో హింసాత్మక ఘర్షణలు జరిగాయి. దాంతో అప్పుడు షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ అధికారాన్ని కోల్పోయింది. హసీనా రాజీనామా చేసి, దేశాన్ని భారత్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ఎన్నికల జరిగే వరకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది.