Sunday, December 22, 2024
Homeఅంతర్జాతీయంప్రపంచంలో సంతోషకరమైన దేశం ఫిన్లాండ్

ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఫిన్లాండ్

Date:

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. యూఎన్‌ ఆధారిత సంస్థ 2024 విడుదల చేసిన రిపోర్ట్‌లో వరుసగా ఏడోసారి ఆ దేశం టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. బుధవారం ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ హ్యాపీనెస్‌’ సందర్భంగా యూఎన్‌ ఆధారిత సంస్థ ర్యాంకులను విడుదల చేసింది.

జీవితంపట్ల సంతృప్తి, దేశ తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దాతృత్వం వంటి అంశాల ఆధారంగా ప్రపంచంలోనే 143 దేశాలకు ర్యాంకింగ్‌లను నిర్ణయించినట్టు సంస్థ వెల్లడించింది. ఈ రిపోర్ట్‌లో నార్డిక్‌ దేశాలైన ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక ఈ జాబితాలో భారత్‌ ఏకంగా 126వ స్థానంలో నిలివడం గమనార్హం. ఈ జాబితాలో చైనా (60), నేపాల్‌ (93), పాకిస్థాన్‌ (108), మయన్మార్‌ (118) దేశాలు మనకంటే ముందుస్థానాలో నిలిచాయి. 2020లో తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్థాన్‌ ఈ జాబితాలో చిట్టచివరి స్థానం (143)లో నిలిచింది. కోస్టారికా 12వ స్థానంలో, కువైట్‌ 13వ స్థానంలో నిలిచాయి. ఇక అగ్రరాజ్యం అమెరికా 23వ స్థానం, జర్మనీ 24వ ర్యాంకులో నిలిచాయి.