Tuesday, December 24, 2024
Homeఅంతర్జాతీయంప్రధాని పదవి నుంచి దిగి సైకిల్‌పై ఇంటికి

ప్రధాని పదవి నుంచి దిగి సైకిల్‌పై ఇంటికి

Date:

నెదర్లాండ్స్‌ నూతన ప్రధానిగా డిక్‌ స్కూఫ్‌ ప్రమాణస్వీకారం చేశారు. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మార్క్‌ రుట్టే కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగించి తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అయితే, అందరు నేతల్లా బందోబస్తు నడుమ కారులో కాకుండా సామాన్యుడిలా సైకిల్‌పై తన సొంతింటికి వెళ్లిపోయారు. సైకిల్‌ నడుపుకుంటూ సిబ్బందికి టాటా చెబుతూ వీడ్కోలు పలికారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రిటైర్డ్‌ పోలీసు అధికారిణి, పుదుచ్చేరి మాజీ గవర్నర్‌ కిరణ్‌ బేడీ సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో మార్క్‌ రుట్టేపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అధికార మార్పిడి ఇలా శాంతియుతంగా, ఆనందంగా ఉంటే ప్రజాస్వామ్యం బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.