Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయంపాకిస్థాన్‌లో తీవ్రమవుతున్న ఆర్థిక సమస్యలు

పాకిస్థాన్‌లో తీవ్రమవుతున్న ఆర్థిక సమస్యలు

Date:

దేశంలో తీవ్రమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేయటానికి, దేశంలోని వ్యూహాత్మక కంపెనీలు మినహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలపై సమావేశం నిర్వహించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. సోమవారం ఐఎంఎఫ్‌తో దీర్ఘకాలం సాయంపై చర్చించిన అనంతరం ప్రైవేటీకరణ దశగా ప్రధాని నిర్ణయం వెలువడటం గమనార్హం.

ఇప్పటి వరకు తీవ్ర నష్టాల్లో ఉన్న సంస్థలు మాత్రమే పాక్‌ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఇక ఐఎంఎఫ్‌ సుదీర్ఘకాలంగా ఆ దేశాన్ని ప్రైవేటీకరణ దిశగా నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రధాని కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. ”లాభాల్లో ఉన్నా.. నష్టాల్లో ఉన్నా సరే ప్రభుత్వ రంగ కంపెనీలు మొత్తాన్ని ప్రైవేటీకరిస్తాం” అని దానిలో పేర్కొన్నారు. ఇప్పటికే పాక్‌ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌ సంస్థ విక్రయ ప్రక్రియను వేగవంతం చేసింది. గత నెలాఖరులో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్‌కు మరో 1.1 బిలియన్‌ డాలర్ల రుణాన్ని ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదముద్ర వేసింది. 3 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీపై పాకిస్థాన్‌, ఐఎంఎఫ్‌ మధ్య జరిగిన ఒప్పందం ఏప్రిల్‌తో ముగిసింది. ఈ క్రమంలోనే చివరి విడతగా రుణాన్ని మంజూరుచేసేందుకు అంగీకారం లభించింది. కాగా.. ఒప్పందంలో భాగంగా ఇప్పటికే పాక్‌ రెండు విడతల్లో 1.9 బిలియన్‌ డాలర్లను అందుకుంది.