ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి కోసం, నొప్పి లేకుండా చావాలని కోరుకునేవారి కోసం స్విట్జర్లాండ్ సైంటిస్టులు ఓ మిషన్‌ను కనిపెట్టగా దానికి చట్టబద్ధతను స్విట్జర్లాండ్ ప్రభుత్వం కల్పించింది. ఎవరైనా మానసికంగా కుంగిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తారు. ఆత్మహత్య కోసం ఉరి వేసుకోవడం లేదా కాల్వలో దూకడం లేదా రైలుపట్టాల కింద పడటం లాంటి చర్యలకు పాల్పడతారు. అయితే ఇకపై అలాంటి చర్యలకు పాల్పడకుండా నొప్పి లేకుండా నిమిషంలోనే చనిపోయేలా స్విట్జర్లాండ్‌లోని సైంటిస్టులు ఓ పరికరాన్ని కనిపెట్టారు.
కోరుకున్న సమయానికి నొప్పి లేకుండా చనిపోయేందుకు ఈ మిషన్ సహకరిస్తుందని స్విట్లర్లాండ్ సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మిషన్‌కు సార్కో అని పేరు కూడా పెట్టారు. ఎవరైనా చనిపోవాలని కోరుకునేవారు శవపేటిక తరహాలో ఉండే సార్కో మిషన్‌లో పడుకుంటే చాలు. నిమిషం గడవక ముందే చనిపోతారు. ఈ మిషన్‌లో పడుకోగానే…. శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో వెంటనే మరణిస్తారు. ప్రాణాలను నిమిషంలోనే తీయగల ఈ యంత్రాన్ని వినియోగదారులు నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు. అయితే ఈ యంత్రం కనిపెట్టడంపై విమర్శలు రాగా… ప్రభుత్వం రంగంలోకి దిగి చట్టబద్ధతను కల్పించింది. కాగా రోగాల బారిన పడిన వారు చనిపోవాలంటే స్విట్జర్లాండ్‌లో ముందుగా ప్రభుత్వం నుంచి చాలా అనుమతులను తీసుకోవాలి. అసిస్టెడ్ డైయింగ్ కోసం డాక్టర్లను ఒప్పించి లిక్విడ్ సోడియం పెంటోబార్బిటల్‌ను తీసుకోవాలి. కానీ సూసైడ్ మిషన్‌తో అలాంటి ఇబ్బందులేవీ లేకుండా ప్రశాంతంగా చనిపోవచ్చు.