Sunday, December 22, 2024
Homeఅంతర్జాతీయంనగ్నంగా జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్న దంపతులు

నగ్నంగా జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్న దంపతులు

Date:

బ్రెజిల్‌లోని సావో పాలోకు చెందిన బెల్లా మాంటోవానీ, వాగ్నర్ ఓ. ఫెరా కొంతకాలం క్రితం పెళ్లి చేసుకున్నారు. కానీ, మత విశ్వాసాల కారణంగా వారి శృంగార జీవితం అంతగా సంతృప్తికరంగా అనిపించలేదు. దాంతో విసిగిపోయిన ఈ జంట, రొమాన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వైవాహిక జీవితంలో ఏదో ఒక మసాలా యాడ్ చేయాలనుకున్నారు. అలా ఆలోచనల్లో పడిపోయిన వారికి 2011లో న్యూడ్ వర్కౌట్స్‌ చేయాలనే ఒక ఐడియా తట్టింది.

అంతే ఇంకేముంది మొత్తం బట్టలు విప్పుకొని జిమ్‌లో వర్కవుట్లు చేయడం మొదలుపెట్టారు, ఇలా నూలుపోగు కూడా లేకుండా వ్యాయామం చేస్తే ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయని ఈ దంపతులు అంటున్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన పద్ధతి అని చాలామంది తిట్టిపోస్తున్నా.. వారు మాత్రం ఇలా చేయడాన్ని ఆపేది లేదంటున్నారు. 2011 నుంచి వారి ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు.

ఇతరుల ప్రైవసీని గౌరవించడానికి ప్రైవేట్ జిమ్‌ల్లో మాత్రమే వీరు నగ్నంగా వర్కౌట్స్ చేస్తారు. ఓనర్లకు డబ్బులు ఇచ్చి జిమ్‌ సెంటర్ ఏకాంతంగా ఉండేలా చూసుకుంటారు. బట్టలు విప్పి వర్కౌట్స్‌ చేసేటప్పుడు ఎవరూ చూడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. దుస్తులు లేకుండా వ్యాయామం చేస్తుంటే స్వేచ్ఛగా, ఉత్సాహంగా అనిపిస్తుందని వాగ్నెర్ చెబుతున్నారు. ఈ వింతైన ఫిట్‌నెస్ రొటీన్ రిలేషన్‌షిప్‌ను మరింత బలపరిచి, ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానాన్ని పెంచిందని తెలిపాడు. వీరు సబ్‌స్క్రిప్షన్ సోషల్ ప్లాట్‌ఫామ్ ఓన్లీ ఫ్యాన్స్ లో ఒక పేజీని కూడా రన్ చేస్తున్నారు. అక్కడ అడల్ట్ కంటెంట్ షేర్ చేస్తారు.

కొన్నిసార్లు బెల్లా వాగ్నెర్‌ మెడకు తాడు కట్టి కుక్కలాగా నడిపించడం చేస్తుంటుంది. బట్టలన్నీ విప్పేసి వాకింగ్ కూడా చేస్తారట. ఈ యాక్టివిటీస్ ద్వారా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. బెల్లా, వాగ్నెర్ ఇద్దరూ న్యూడ్ వర్కవుట్లు శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా భావోద్వేగ సంబంధానికి కూడా ప్రయోజనం అందిస్తున్నాయని నమ్ముతున్నారు.

బెల్లా న్యూడ్‌ లైఫ్‌స్టైల్‌తో సంతృప్తిని వ్యక్తం చేసింది. ఆమె మరొక జీవితాన్ని కోరుకోవడం లేదని పేర్కొంది. విమర్శకులు తరచుగా అసూయతో టార్గెట్ చేస్తున్నారని వాగ్నెర్ అభిప్రాయపడ్డాడు. చాలా మంది రహస్యంగా స్వేచ్ఛ స్థాయి కోసం ఆరాటపడతారని అన్నాడు. రొమాంటిక్ మ్యారీడ్ లైఫ్‌ ఆనందాన్ని పెంచిందని వారి బంధాన్ని బలోపేతం చేసిందని అతడు అంటున్నాడు.

బెల్లా, వాగ్నర్ న్యూడ్ కంటెంట్‌తో పాపులర్ అయ్యారు కానీ, వారి డైలీ డొమెస్టిక్ యాక్టివిటీస్ చూడటానికి ఇష్టపడే వారు కూడా ఉన్నారు. అభిమానులు ఈ దంపతులు వంటలు చేయడం, పాత్రలు కడగడం, మంచం సిద్ధం చేసుకోవడం వంటి సాధారణ పనులను చూసేందుకు కూడా ఆసక్తి చూపిస్తారు. ఫ్యాన్స్ కోసం వీరు వారానికి ఒకసారి, తమ ఇంట్లోని వివిధ ప్రాంతాల ఫొటోలను షేర్ చేస్తారు. ఈ ఫొటోషూట్స్ కోసం, ఎల్లప్పుడూ క్లీనింగ్ టూల్స్ కూడా ఫొటోలో ఉంచుతారు. కొన్నిసార్లు అభిమానులు వింతైన అభ్యర్థనలు చేసినా వారు ఫీల్ అవ్వరు. బెల్లా, వాగ్నర్ ఈ ఫొటోషూట్లతో ఆనందిస్తారు.