మాల్దీవులకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. భారతీయ పర్యాటకులు ఎక్కువగా లక్షద్వీప్ వెళ్తుండడంతో ఆ దేశ పర్యాటకం దివాళా తీసింది. దీంతో తమ దేశ ఆర్థిక వ్యవస్థకి సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ఇరుదేశాల మధ్య బంధం చారిత్రకమైందని గుర్తు చేశారు. ‘మనకు ఓ చరిత్ర ఉంది. కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం భారత్ తో కలిసి పని చేయాలనుకుంటోంది. మేం ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాం. మా ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలు కూడా భారతీయులకు ఘన స్వాగతం పలుకుతున్నాం. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగం కావాలని పర్యాటక మంత్రిగా భారతీయులను కోరుతున్నాను.’ అంటూ సోమవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.