Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయంతొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేసుకున్న వ్యక్తి మృతి

తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేసుకున్న వ్యక్తి మృతి

Date:

రెండు నెలల క్రితం మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రి వైద్యులు ప్రపంచంలోనే తొలిసారిగా అవయవ మార్పిడిలో భాగంగా పంది కిడ్నీతో ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకొని చరిత్ర సృష్టించిన 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ మరణించారు. స్లేమాన్‌కు జన్యు మార్పిడి చేసిన పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు. అది సక్రమంగా పని చేస్తుండడంతో రెండు వారాల అనంతరం డిశ్ఛార్జ్‌ చేశారు. ఆ తర్వాత రెండు నెలల పాటు అతడికి ఎటువంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తలేదు. ఈ నేపథ్యంలో రిచర్డ్‌ ఆకస్మిక మరణానికి శస్త్ర చికిత్సకు సంబంధం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ”రిచర్డ్‌ స్లేమాన్ మరణించడం పట్ల జనరల్ ట్రాన్స్‌ప్లాంట్ బృందం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. ఇటీవల అతడికి చేసిన అవయవ మార్పిడి మూలంగా ఈ ఘటన జరగలేదని పరీక్షల్లో తేలింది. అయితే.. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉన్నాయి”అని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.