Thursday, September 19, 2024
Homeఅంతర్జాతీయంతాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాను, పార్టీని కాపాడుకుంటాను..

తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాను, పార్టీని కాపాడుకుంటాను..

Date:

బంగ్లాదేశ్‌లో హింసాకాండ అక్కడి రాజకీయ పరిస్థితులను ఒక్కసారిగా మార్చేసింది. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయి, చివరకు ఆమె భారత్‌లో ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేప‌ధ్యంలో తాను త‌న‌ తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటానని సాజీబ్ వాజెద్ ప్రకటించారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమని తెలిపారు. గతంలో తనకు అలాంటి ఉద్దేశమే లేదని, అయితే అవామీ లీగ్‌ పార్టీ నేతలపై దాడుల నేపథ్యంలో ఆ పార్టీని రక్షించుకునేందుకు తాను ఏం చేయడానికైనా వెనకడుగు వేయనని స్పష్టంచేశారు.

రాజకీయాల్లో చేరాల్సిన అవసరం ఉందనుకుంటే.. నేను వెనక్కి తగ్గను. ఈసారి పదవీకాలం పూర్తయిన తర్వాత మా అమ్మ రాజకీయాల నుంచి రిటైర్ అయ్యేవారు. నాకు రాజకీయంగా ఎలాంటి ఆశయాలు లేవు. నేను ఎప్పుడో అమెరికాలో సెటిల్ అయ్యాను. కానీ ప్రస్తుత బంగ్లా పరిణామాల వేళ.. నాయకత్వ లోటు కనిపిస్తోంది. అవామీ లీగ్‌ పార్టీ, నేతల కోసం నేను చురుగ్గా వ్యవహరిస్తున్నాను” అని వాజెద్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో అవామీ లీగ్‌ పోటీ చేసి, గెలుపొందుతుందన్న నమ్మకంతో ఉన్నానన్నారు. ” మా అమ్మ ఏ దేశాన్ని ఆశ్రయం కోరాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఉన్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన తర్వాత ఆమె మళ్లీ అక్కడికే వెళ్తారు. నా తల్లికి రక్షణ కల్పించిన భారత ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు” అని అన్నారు.