Wednesday, January 22, 2025
Homeఅంతర్జాతీయంట‌ర్కీలో అగ్నిప్ర‌మాదం.. 66కు చేరిన మృతులు

ట‌ర్కీలో అగ్నిప్ర‌మాదం.. 66కు చేరిన మృతులు

Date:

ట‌ర్కీలో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 66కు పెరిగింది. క్షతగాత్రుల సంఖ్య 51కి చేరింది. బోలో ప్రావిన్స్‌లోని గ్రాండ్ క‌ర్తాల్ హోట‌ల్‌లో ఈ ప్రమాదం జ‌రిగింది. 12 అంత‌స్తులు ఉన్న ఆ హోట‌ల్‌లో తెల్లవారుజామున 3.30 గంటలకు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ప్రమాదానికి గ‌ల కార‌ణాల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స‌మ‌యంలో హోట‌ల్లో క‌స్టమ‌ర్లు కొంద‌రు బెడ్ షీట్లు, బ్లాంకెట్ల సాయంతో రూమ్‌ల నుంచి కింద‌కు వ‌చ్చే ప్రయ‌త్నంచేశారు. ప్రమాదం జరిగినప్పుడు 234 మంది గెస్టులు ఉన్నట్లు అంచ‌నా వేస్తున్నారు. అందరూ నిద్రలో ఉన్నప్పుడు నిప్పు అంటుకున్నద‌ని, వెంట‌నే బ‌య‌ట‌కు ప‌రుగులు తీశామ‌ని ఓ స్కీయింగ్ ఇన్‌స్ట్రక్టర్ తెలిపారు. హోట‌ల్ గ‌దుల్లో పొగ క‌మ్ముకుపోవ‌డంతో గెస్టులు ఫైర్ ఎస్కేప్‌ను గుర్తించడం క‌ష్టంగా మారింద‌న్నారు.

హోట‌ల్‌కు చెందిన రూఫ్‌తోపాటు టాప్ ఫ్లోర్లు కూడా అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. గ్రాండ్ క‌ర్తాల్ హోట‌ల్‌లో మొత్తం 161 రూమ్‌లు ఉన్నాయి. దేశ రాజ‌ధాని ఇస్తాంబుల్‌కు 300 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న కొరొగ్లు ప‌ర్వతాల్లో స్కీ రిసార్టు ఉన్నది. కాగా స్కూళ్లకు సెమిస్టర్ సెలువులు ఇవ్వడంతో రిసార్టుల‌న్నీ పూర్తిగా గెస్టుల‌తో నిండిపోయాయి. ప్రమాదం జ‌రిగిన హోట‌ల్ వ‌ద్దకు 30 ఫైర్ ట్రక్కులు, 28 అంబులెన్సుల‌ను పంపారు.