Saturday, January 4, 2025
Homeఅంతర్జాతీయంచిన్మ‌య్ కృష్ణ దాస్‌కు బెయిల్ నిరాక‌ర‌ణ‌

చిన్మ‌య్ కృష్ణ దాస్‌కు బెయిల్ నిరాక‌ర‌ణ‌

Date:

బంగ్లాదేశ్ ఇస్కాన్ నేత చిన్మ‌య్ కృష్ణ దాస్ బ్ర‌హ్మ‌చారికి బెయిల్ నిరాక‌రించారు. చిట్ట‌గ్రామ్ మెట్రోపాలిటిన్ సెష‌న్స్ జ‌డ్జి మ‌హ‌మ్మ‌ద్ సైఫుల్ ఇస్లామ్ బెయిల్‌ను తిర‌స్క‌రిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇరు ప‌క్షాల నుంచి సుమారు 30 నిమిషాల పాటు వాద‌న‌లు విన్న త‌ర్వాత ఆయ‌న తీర్పు వెలువ‌రించారు. బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ చేసుకోనున్న‌ట్లు చిన్మ‌య్ త‌ర‌పు న్యాయ‌వాది అపూర్వ కుమార్ భ‌ట్టాచార్జీ తెలిపారు. అపూర్వ నేతృత్వంలోని సుమారు 11 మంది సుప్రీంకోర్టు లాయ‌ర్లు.. ఇవాళ మెట్రోపాలిట‌న్ కోర్టుకు వెళ్లారు. న్యాయ బృందం త‌మ వాద‌న‌ల‌ను బ‌లంగానే వినిపించినా.. కోర్టు మాత్రం చిన్మ‌య్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. న‌వంబ‌ర్ 25వ తేదీన చిన్మ‌య్ కృష్ణ దాస్‌పై దేశ‌ద్రోహం కేసు న‌మోదు అయ్యింది. ఆయ‌న్ను హ‌జ్ర‌త్ షాజ‌లాల్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.