Tuesday, January 7, 2025
Homeఅంతర్జాతీయంకెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడీ

కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడీ

Date:

కెనడా చరిత్రలోనే 2023 ఏప్రిల్ 17న టోరంటో ఎయిర్ పోర్టులో అతిపెద్ద బంగారం దోపిడీ జరిగిన సంఘటన మనకు తెలిసిందే. తాజాగా ఈ కేసు సంబంధించి మొత్తం ఆరుగురిని అధికారులు ఏప్రిల్ 17 బుధవారం నాడు అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు కూడా ఉండడం గమనార్హం. ఇప్పటికే ఈ కేసులో మరో ముగ్గురికి కూడా అధికారులు వారెంట్లను జారీ చేశారు.

గత ఏడాది 22 మిలియన్ డాలర్ల విలువ కలిగిన బంగారం, విదేశీ కరెన్సీని తీసుకెళ్తున్న ఎయిర్ కార్గో కంటైనర్ ను కొందరు దొంగలించారు. ఈ దోపిడీలో స్విజర్లాండ్ లోని జ్యూరిచ్ నగరం నుండి ఎయిర్ కెనడా విమానంలో వచ్చిన కంటైనర్ ను నకిలీ డాక్యుమెంట్స్ తో వారు చోరీ చేయడం జరిగింది. ఈ చోరీ సమయంలో ఇద్దరు ఎయిర్ డిపార్ట్మెంట్ సంబంధించి కెనడా మాజీ ఉద్యోగులు సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ పోలీసులు కస్టడీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధమున్న మరో ఇద్దరికీ కూడా అరెస్టు వారంటీని జారీ చేశారు. గత సంవత్సరం జరిగిన దోపిడీ కేసులో సంవత్సరం రోజులపాటు విచారణ జరిగిన అనంతరం నిందితులను తాజాగా అరెస్టు చేశారు. ఈ కేసు లో అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన అంటారియోకు చెందిన పర్మ్ పాల్ సిద్దూ, అమిత్ జలోటా లు ఉండగా.. వీరితోపాటు అమ్మద్ చైదరి, అలి రజా, ప్రసాద్ పరమలింగంను కూడా అరెస్ట్ చేశారు అధికారులు. ఇది ఇలా ఉండగా దోపిడీ జరిగిన సమయంలో పరంపల్ సిద్దూ ఎయిర్ కెనడాలో పనిచేయడం గమనార్హం.