Monday, September 23, 2024
Homeఅంతర్జాతీయంకిమ్ పాల‌న‌తో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు ఉరిశిక్ష‌

కిమ్ పాల‌న‌తో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు ఉరిశిక్ష‌

Date:

ఉత్తర కొరియా అధినేత‌ కిమ్ జోంగ్ ఉన్‌కు నియంత అనే పేరు ఉంది.. చాలా మంది ఆయన్ని మనిషి కాదు, రాక్షసుడు అంటుంటారు. ఆ దేశంలో ప్రజలకు ఎన్నో కండీషన్లు. చివరకు తలకి ఉండే జట్టు, పెట్టుకునే పేరు విషయంలో కూడా కిమ్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాడు. ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యాలు ఫరిడవిల్లుతున్న ఈ రోజుల్లో ఇలాంటి నియంతల్ని నెత్తిన పెట్టుకొని పోషిస్తున్న నార్త్ కొరియా ప్రజలు నిజంగా దురదృష్టవంతులే. తాజాగా కిమ్ పుణ్యమా అని ఇద్దరు మహిళలకు ఉరిశిక్ష పడిపోయింది.

ఉత్తర కొరియాకి చెందిన కాంగ్‌, రీ అనే ఇద్దరు మహిళలు చైనాలో ఉంటున్నారు. అలా ఉన్నందుకు కిమ్ ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. కానీ వాళ్లు చైనాలో ఉంటూ ఉత్తరకొరియా నుంచి దక్షిణ కొరియాకు పారిపోవాలనుకునే వారికి హెల్ప్ చేస్తున్నారు. ఎలా పారిపోవాలో, ఎలా సరిహద్దు దాటాలో అన్నీ చూసుకుంటున్నారు. ఈ విషయం కిమ్‌కి తెలిసింది. దిమ్మ తిరిగింది. పెద్ద పెద్ద వాళ్లకే తనను చూస్తే.. వణుకొస్తుంది.. అలాంటిది వేరే దేశంలో ఉన్న ఆ ఇద్దరు మహిళలకూ ఇంత ధైర్యమా.. అనుకున్న కిమ్.. వాళ్లను నార్త్ కొరియాకి రప్పించాడు. వాళ్లను ఉరితీయించాడని వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల కిందట ఈ ఉరి అమలైనట్లు తెలిసింది. కిమ్ ప్రభుత్వం ఈ ఘటనపై భిన్నంగా స్పందించింది. ఆ ఇద్దరు మహిళలూ మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని చెప్పింది. ఐతే.. ఆ ఇద్దరినే కాదు.. మరో 9 మంది మహిళలను కూడా పట్టుకొని.. వారికి జీవిత ఖైదు విధించింది. ఇలా కిమ్ చేసిన పనిని చూసి ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. కానీ కిమ్‌ని మాత్రం ఏమీ చెయ్యట్లేదు. మాటలకే పరిమితం అవుతున్నాయి.