Wednesday, December 25, 2024
Homeఅంతర్జాతీయంఈ దేశంలో హవాయ్ చెప్పుల ధర అక్షరాల లక్ష రూపాయలు

ఈ దేశంలో హవాయ్ చెప్పుల ధర అక్షరాల లక్ష రూపాయలు

Date:

ఇండియాలో హవాయఅ చెప్పులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. కానీ సౌదీ అరేబియాలో ఈ హవాయ్ చెప్పులు లక్ష రూపాయలకు అమ్ముతున్నారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదిక ప్రకారం, సౌదీ అరేబియాలో హవాయి చెప్పులను ట్రే పైన గాజు షెల్ఫ్ లో నగలుగా ఉంచుతారు. దీని ధర చాలా ఎక్కువగా ఉంది. బహుశా ఎవరైనా దీనిని కొనుగోలు చేసే ముందు కనీసం 100 సార్లు ఆలోచిస్తారు. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్లో లఖానీ కంపెనీకి చెందిన వైట్-బ్లూ హవాయి చప్పల్ రూ.259కు లభిస్తుంది. లఖానీ కంపెనీకి చెందిన చెప్పులు రూ.369 ఉండగా సౌదీ అరేబియాలో ఈ చెప్పులు లక్ష రూపాయలకు పైగానే అమ్ముడవుతున్నాయి.

తాజాగా ట్విట్టర్ యూజర్ @rishibagree ఈ చెప్పులకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ విక్రేత గాజు షెల్ఫ్ నుంచి చెప్పులను తొలగిస్తూ కనిపించాడు. అప్పుడు అతను చెప్పులను కస్టమర్ ముందు ఉంచుతాడు. దీని ధర 4500 రియాళ్లకు దగ్గరగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన చాలా మంది కామెంట్లు మరియు వారి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. భారతీయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ చెప్పులను భారత్ నుంచి 100 రూపాయలకు కొనుగోలు చేసి సౌదీ అరేబియాలో 4500 రియాల్స్ కు విక్రయించాలని ఒకరు కోరారు. బాత్రూంకు వెళ్లడానికి ఈ చెప్పులు వాడుతున్నానని ఒకరు చెప్పారు. ఇది చూసిన తర్వాత మరుసటి రోజు నుంచి రిలాక్సో షేర్లు ఆకాశాన్నంటుతున్నాయని ఒకరు చెప్పారు.