ఇరాన్ గతంలో తమపై జరిపిన డ్రోన్ల దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ శనివారం టెహ్రాన్ పై విరుచుకుపడింది. ఈ దాడిలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ లో ఏ స్ధాయిలో నష్టం జరిగిందన్న వివరాలు బయటికి రాలేదు. కానీ ఇజ్రాయెల్ మాత్రం దీన్ని పరిమిత దాడిగానే పేర్కొంది. అయితే ఈ దాడి సమాచారం తెలియగానే మూడు దేశాలు తమ గగనతలాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించాయి.
ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలపై ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్ క్షిపణుల దాడి జరిగింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై 200కు పైగా రాకెట్లు, బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇవాళ ప్రతిదాడి చేసింది. అయితే తెల్లవారుజామున టెహ్రాన్ పై జరిగిన దాడులు పరిమిత నష్టాన్ని కలిగించాయని ఇరాన్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ సమాచారం తెలియగానే ఇరాన్‌తో పాటు వారి మిత్రదేశాలు సిరియా, ఇరాక్ కూడా తమ గగనతలాన్ని మూసేశాయి.
ఫ్లైట్ రాడార్ 24 ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం, మూడు దేశాల మీదుగా ఏ విమానమూ ప్రయాణించడం లేదు. అయితే దాడుల తర్వాత విమానాలను తిరిగి ప్రారంభిస్తామని ఇరాన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. సిరియా రాజధాని డమాస్కస్‌పై ఆక్రమిత గోలన్ హైట్స్, లెబనాన్ నుండి ఇజ్రాయెల్ వైమానిక దాడులను ప్రారంభించిందని, ఇది వాయు రక్షణ వ్యవస్థలను యాక్టివ్ చేయడానికి వారిని ప్రేరేపించినట్లు తెలిపారు.