Sunday, December 22, 2024
Homeఅంతర్జాతీయంఆమె వయస్సు 39, పిల్లలు 19 మంది..

ఆమె వయస్సు 39, పిల్లలు 19 మంది..

Date:

అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏ జరిగినా నిమిషాల వ్యవధిలో తెలిసిపోతుంది. అలాంటిది మెడలిన్ లో ఉండే 39 ఏళ్ల మార్త అనే మహిళకు 19 మంది పిల్లలు ఉన్నారు. అందులో 15 మంది పిల్లలు 18 సంవత్సరాల లోపు వారే. కానీ ఈ 19మంది పిల్లల్లోని ప్రతి పిల్లాడికి తండ్రులు వేరు కావడం గమనార్హం. ఇంతమంది పిల్లలను కనేందుకు ఆమెకు ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించింది. ప్రభుత్వం ఆమెకు ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. ఇలా గర్భం దాల్చడం పిల్లలకు జన్మనివ్వడమే నా పని అంటూ మార్త చెప్తుంది.

ఈ ఘటన మెడలిన్ లో వెలుగులోకి వచ్చింది. ఇలా 19 పిల్లలతో మూడు బెడ్ రూమ్ లు ఉన్న ఇంట్లో నివసిస్తుంది మార్త. ఇంట్లో ఎక్కువ స్థలం లేకపోవడంతో పెద్ద పిల్లలు సోఫాలో నిద్రిస్తారని చెపుతుంది. నాకు నా పిల్లలకి ప్రభుత్వం సహాయం అందిస్తున్నప్పటికీ ఆ డబ్బు సరిపోదు అంటూ చెపుతుంది. అంతేకాకుండా ఆయా పిల్లల తండ్రిలు ఎవరు కూడా పిల్లల బాధ్యతను పట్టించుకోవట్లేదు అంటుంది. తన ఇంటి పక్కన ఉండే ఇరుగు పొరుగు వారు కూడా తనకు సహాయం అందిస్తారు అంటూ తెలిపింది. వేరు వేరు వ్యక్తులతో ఇంతమంది పిల్లలకు జన్మనివ్వడం ఏంటీ అనేది అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.