Friday, January 24, 2025
Homeఅంతర్జాతీయంఅమెరికాలో వేల సంఖ్య‌లో ఉగ్ర‌వాదులు

అమెరికాలో వేల సంఖ్య‌లో ఉగ్ర‌వాదులు

Date:

అమెరికాలో వేల సంఖ్య‌లో ఉగ్ర‌వాదులు, హంత‌కులు ఉన్న‌ట్లు దేశాధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. మాజీ అధ్య‌క్షుడు బైడెన్ అమ‌లు చేసిన అనేక విధానాల‌ను ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. దేశాధ్య‌క్ష బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత ప‌లు ఎగ్జిక్యూటివ్ ఆదేశాల‌పై ఆయ‌న సంత‌కం చేశారు. ఈ నేప‌థ్యంలో ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడారు. దేశంలో ఉన్న డ్ర‌గ్ కార్ట‌ల్స్‌ను విదేశీ ఉగ్ర సంస్థ‌లుగా అభివ‌ర్ణించారు. హౌతీ రెబ‌ల్స్‌ను కూడా తీవ్ర‌వాద గ్రూపుగా ట్రంప్ పేర్కొన్నారు.

దేశంలో వేల సంఖ్య‌లో ఉగ్ర‌వాదులు ఉన్నార‌ని, వేల వేల సంఖ్య‌లో హంత‌కులు కూడా ఉన్నార‌ని, వారంద‌ర్నీ అణిచివేయ‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాలో ప్ర‌స్తుతం 11 వేల మంది హంత‌కులు జీవిస్తున్న‌ట్లు చెప్పారు. దాంట్లో 48 శాతం మంది.. ఒక‌రి క‌న్నా ఎక్కువ మందిని హ‌త‌మార్చిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. విదేశాల్లో జైళ్ల‌లో ఉన్న వారు అమెరికాకు వ‌చ్చేస్తున్నట్లు తెలిపారు.