Sunday, December 22, 2024
Homeఅంతర్జాతీయంఅందం కోసం 43 సార్లు ప్లాస్టిక్ సర్జరీలు

అందం కోసం 43 సార్లు ప్లాస్టిక్ సర్జరీలు

Date:

ఒక మహిళ బార్బీ బొమ్మలా అందంగా కనిపించాలని కోరుకుంది. దీని కోసం ఆమె ఒకటి రెండుసార్లు కాదు మొత్తం 43 సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. దీని ప్రభావంతో ఆమె ముఖమే వింతగా మారిపోయింది. ఇప్పుడు చాలా మంది ఆమెను జాంబీగా పిలుస్తున్నారు. ఆ మహిళ పేరు దాలియా నయీమ్. ప్రపంచం ఏమన్నా ఆమె తనను తాను రియల్ లైఫ్ బార్బీ గర్ల్‌గా భావిస్తుంది. దాలియా ఇరాక్‌లోని బాగ్దాద్‌లో నివసిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా ఫేమస్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 9 లక్షల 95 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ వివిధ రకాల ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తుంది. ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆమెను ‘జోంబీ’ అని కూడా పిలుస్తారు. కొంతమంది ఆమెను ‘ఇరాకీ బార్బీ’ అని కూడా పిలుస్తారు.

ఆమె పెదవులతో పాటు, తన ముక్కు, ముఖం, వక్షోజాలకు శస్త్రచికిత్స చేయించుకుంది. ఆమె ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె తన మేకప్ ఆర్టిస్ట్‌తో పోజులిచ్చింది. ఆ వీడియోలో మేకప్ ఆర్టిస్ట్ డాలియాతో ‘నువ్వు బార్బీ లాగా చాలా అందంగా ఉన్నావు’ అని చెప్పగా, దానికి ప్రతిగా ఆమె కూడా అతనిని మెచ్చుకుంటూ మీ మేకప్ అద్భుతంగా ఉందని చెప్పింది.