Friday, January 3, 2025
Homeఅంతర్జాతీయంభార్య బికినీ వేసుకుని తిరిగేందుకు ఐలాండ్‌ కొన్న‌ భర్త

భార్య బికినీ వేసుకుని తిరిగేందుకు ఐలాండ్‌ కొన్న‌ భర్త

Date:

దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త ఐదు కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ. 418 కోట్లకు ఓ ప్రైవేట్ ఐలాండ్‌ను కొనుగోలు చేశాడు. దీనికి కారణం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. త‌న భార్య బికినీలో బీచ్‌లో ఎలాంటి భయం లేకుండా తిరిగేందుకు ఈ వ్యాపారవేత్త ఈ దీవిని కొనుగోలు చేశాడు. 26 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సౌదీ అల్ నదక్ స్వయంగా ఈ వార్తని, దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. తాను బికినీ ధరించాలని అనుకున్నానని, అందుకే తన బిలియనీర్ భర్త ఓ ప్రైవేట్ ఐలాండ్ కొన్నాడని చెప్పింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ ద్వీపం ఏ దేశంలో ఉందో చెప్పలేదు.

బ్రిటన్‌కు చెందిన సౌదీ, దుబాయ్ వ్యాపారవేత్త జమాల్ అల్ నదక్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ దుబాయ్‌లో చదువుతున్నప్పుడు కలుసుకున్నారు. వివాహం జరిగి మూడేళ్లు దాటింది. సౌదీ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ప్రసిద్ధి చెందింది. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితం గురించి తరచుగా పంచుకుంటుంది. ప్రైవేట్ ఐలాండ్‌కి సంబంధించిన వీడియో వారంలోపే 2.4 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. ‘గోప్యతా కారణాల వల్ల మేము ఖచ్చితమైన స్థానాన్ని పంచుకోవడం లేదు. కానీ ఇది ఆసియాలో ఉంది. దీని ధర $50 మిలియన్లు’ అని సౌదీ తెలిపింది. సౌదీ విలాసవంతమైన జీవనశైలి కారణంగా సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటోంది. అతను ధనవంతుడైతే సొంత ఫ్లైట్ ఎందుకు లేదు అని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు అసలు ఇలాంటి భర్త దొరికితే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు.