దాదాపు 24 ఏళ్ల తర్వాత పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఇద్దరు నేతలూ ఒకరికొకరు పలు రకాల బహుమతులను ఇచ్చి పుచ్చుకున్నారు. తన పర్యటన సందర్భంగా ఉత్తర కొరియా అధినేతకు పుతిన్ అత్యంత ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. రష్యన్ మేడ్ లిమోసిన్‌ను గిఫ్ట్ చేశారు. అనంతరం ఇద్దరూ ఈ కారులో సరదాగా డ్రైవ్‌కు వెళ్లారు. ఆ సమయంలో పుతిన్ కారును స్వయంగా డ్రైవ్ చేయడం విశేషం. పుతిన్ పక్కనే కిమ్ కూర్చొని ఉన్నారు. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఇక కిమ్‌కు గిఫ్ట్ చేసిన కారు లిమోసిన్.. రష్యాలోనే తయారైంది. పుతిన్ తన కాన్వాయ్‌లోనూ ఇలాంటి కార్లనే ఉపయోగిస్తున్నారు.
మరోవైపు కిమ్ కూడా పుతిన్‌కు అరుదైన కొరియన్ జాతి శునకాలను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఫుంగ్సన్ జాతికి చెందిన శునకాలను పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారు. కొరియా ద్వీపకల్పంలో ఉత్తర దిక్కున్న కొండ ప్రాంతాల్లో ఫుంగ్సన్ జాతి శునకాలు నివసిస్తుంటాయి. మంచును తట్టుకునే చర్మం వాటికి ఉంటుంది. పెద్ద పెద్ద జంతువులను కూడా అవి ఢీకొట్టగలవు.