Wednesday, January 15, 2025
Homeఅంతర్జాతీయంక‌ణితి బ‌దులు కాలేయం తొల‌గించిన వైద్యులు

క‌ణితి బ‌దులు కాలేయం తొల‌గించిన వైద్యులు

Date:

ఓ వైద్యుడు శస్త్ర చికిత్స కోసం ఆసుప‌త్రికి రావ‌డంతో వైద్యులు కణితి బదులు పొరపాటుగా కాలేయం తొలగించడంతో ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. న్యూయార్క్‌ పోస్ట్‌ ప్రకారం విలియం బ్రయాన్ (70) అతడి భార్య బెవర్లీ ఫ్లోరిడాలో నివాసం ఉంటున్నారు. గత వారం విలియంకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. వివిధ పరీక్షల అనంతరం వృద్ధుడి కాలేయంపై కణితి ఉందని, వెంటనే ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యులు అందుకు అంగీకరించారు.

ఆపరేషన్‌ సమయంలో డాక్టర్‌ పొరపాటుగా వృద్ధుడి కాలేయాన్ని తొలగించడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు జనరల్ సర్జన్ డాక్టర్ థామస్ షక్నోవ్‌స్కీ, ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ క్రిస్టోఫర్ బకానీలను అదుపులోకి తీసుకొని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. శస్త్రచికిత్స చేసిన డాక్టర్ డాక్టర్ షక్నోవ్‌స్కీకి 2023లో కూడా ఓ వ్యక్తికి ఆపరేషన్‌ చేస్తూ ఒకదానికి బదులుగా మరో శరీర భాగాన్ని తీసివేయడంతో అతడు మృతి చెందినట్లు అధారాలున్నాయని మృతుడి భార్య బెవర్లీ న్యాయస్థానానికి తెలియజేశారు. మరే ఇతర వ్యక్తులకు అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వైద్యుడిపై నిషేధం విధించాలని ఆమె కోరారు. దీంతో న్యాయస్థానం అతడిని విధుల నుంచి తప్పించింది.