15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorizedహైదరాబాద్ సన్ రైజర్స్ సీఈఓ ఈవిడే..

హైదరాబాద్ సన్ రైజర్స్ సీఈఓ ఈవిడే..

Date:

ఐపీఎల్ హైదరాబాద్ సన్ రైజర్స్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు కావ్య మారన్. 2018 నుంచి సన్ రైజర్స్ సీఈవోగా వ్యవహరిస్తోంది. ఐపీఎల్ వేలం నుంచి మ్యాచ్ జరిగే సమయంలో కూడా ఆమె హావభావాలనే అందరూ చూస్తుంటారు. ఒక కెమెరా ఎప్పుడూ కావ్యనే చూపిస్తుంటుంది. సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య. 1992 ఏప్రిల్ ఆరున జన్మించారు. ఆమె తల్లి కావేరి మారన్ సోలార్ టీవీ కమ్యూనిటీ రిస్ట్రిక్టెడ్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. భారతదేశంలో అత్యధిక వేతనం అందుకుంటున్న మహిళా సీఈవోల్లో ఆమె ఒకరు.

తండ్రి మారన్ ఆస్తి రూ.19వేల కోట్లు

కళానిధి మారన్ తండ్రి మురసోలి మారన్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి సమీప బంధువు. చెన్నైలోని స్టెల్లా మెరీస్ కాలేజీ నుంచి కామర్స్‌లో కావ్య డిగ్రీ పట్టా అందుకున్నారు. యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. రూ.33 వేల కోట్ల సన్‌ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి ఆమె ఒక్కటే వారసురాలు. కావ్య ఆస్తుల విలువ రూ.417 కోట్లు. జన్ భారత్ టైమ్స్ రిపోర్టు ప్రకారం ఆమె ఆస్తుల విలువ అది. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2019 ప్రకారం కళానిధి మారన్ ఆస్తుల విలువ రూ.19 వేల కోట్లకు పైగా ఉంది.

బాధితులకు ఆపన్న హస్తం

సన్‌రైజర్స్‌తోపాటు సన్ టీవీ నెట్‌వర్క్ పనులు చూస్తుంటారు. క్యాన్సర్ రోగులకు సాయం చేయడంతోపాటు ప్రకృత్తి విపత్తుల బారిన పడిన వారికి అండగా నిలుస్తుంటారు. వేలంలో సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయలేదని, సన్ రైజర్స్ ప్రదర్శన బాగుండనప్పుడు ఆమెను ట్రోలింగ్ చేస్తుంటారు. 2024 సీజన్ కు ముందు నిర్వహించిన వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేశారు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టు వరుసగా రెండు సీజన్లలో విజేతగా నిలిచింది. ఈ జట్టును కావ్య ఎంతో జాగ్రత్తగా పునాదుల స్థాయి నుంచి నిర్మించుకుంటూ వచ్చారు.