15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorizedస్కూల్ వెళ్ళడానికి ఆటోకు డబ్బుల్లేవ్

స్కూల్ వెళ్ళడానికి ఆటోకు డబ్బుల్లేవ్

Date:

చాలా మంది విద్యార్థులకు చదువుకోవాలని ఆలోచన ఉంటుంది. కాని వారి ఆర్థిక పరిస్థితుల ప్రభావమో, మరేదో తెలియదు కానీ కొంత మంది విద్యార్థుల చదువు మధ్యలోనే ఆగిపోతుంది. అయితే రాజస్తాన్ రాష్ట్రంలోని బికనీర్‌ లో నిరుపేద కుటుంబంలో జన్మించిన ఇద్దరు స్నేహితులు చేసిన ఓ పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రాజస్తాన్ లోని బికనీర్ కు చెందిన సందీప్ సమారియా,నితీష్ కశ్యప్ ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరివి రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు. వీరి స్కూల్ వీరి ఇళ్ల నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. స్కూల్ కి వెళ్లేందుకు రోజూ వీరు ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఆటో ఛార్జీలు కట్టేందుకు తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేవని గ్రహించిన వీరు తమ మెదడుకి పనిపెట్టి తమ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. స్క్రాప్ మెటీరియల్స్ సహాయంతో ఈ-సైకిల్‌ను(E-cycle) తయారు చేశారు. అయితే వీరిద్దరూ సైన్స్ విద్యార్థులని కాకపోవడం విశేషం. ఇద్దరూ 11వ తరగతి ఆర్ట్స్ విద్యార్థులు. సందీప్ తండ్రి స్క్రాప్ డీలర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో సందీప్ ఇంట్లో చాలా చెత్త పడి ఉంది. దీంతో ఇద్దరు స్నేహితులు ఈ స్క్రాప్ తో ఈ-సైకిల్‌ని తయారుచేశారు.

సైకిల్ ఖర్చు ఆరు వేల రూపాయలు

సైకిల్‌లో మోటార్, బ్యాటరీ, సోలార్ ప్యానెల్‌ను అమర్చారు. చిన్న సోలార్‌తో పెద్ద బ్యాటరీ ఛార్జ్ చేయబడుతుంది. పెద్ద బ్యాటరీని ఛార్జ్ చేయడం ద్వారా సౌర వోల్టేజ్ పెరుగుతుంది. దీంతో బ్యాటరీ సరిగ్గా ఛార్జ్ అవుతుంది. దీన్ని సైకిల్‌పై అప్లై చేసి ఈ-సైకిల్‌ను సిద్ధం చేశారు. దీన్ని తయారు చేసేందుకు వారికి మొత్తం ఆరు వేల రూపాయలు ఖర్చయ్యాయి. తమ కుమారుల ఈ ఆవిష్కరణకు ఇరు కుటుంబాలు గర్వపడుతున్నాయి.