15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorizedఅరుదైన వ్యాధితో బాధపడుతూ సివిల్స్ సాధించిన సారిక

అరుదైన వ్యాధితో బాధపడుతూ సివిల్స్ సాధించిన సారిక

Date:

సాధించాలనే పట్టుదల ఉండాలి కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా విజయాన్ని ఆపలేవు. అలాంటిది అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతూ కూడా ఓ యువతి యూపీఎస్‌సీ పరీక్ష రాసి ర్యాంక్ సాధించింది. కండరాల కదలికను ప్రభావితం చేసే పుట్టుకతో వచ్చే ”సెరిబ్రమ్ పాల్సీ” అనే వ్యాధితో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని సారిక ఏకే అనే యువతి సివిల్స్ సాధించారు. తన రెండో ప్రయత్నంలో సారిక ఈ ఘనత సాధించారు. తన కుడి చేతిని ఉపయోగించలేని సారిక ఎడమచేతి ద్వారా మోటరైజ్డ్ వీల్ చైర్‌ని ఉపయోగించే వారు. తన రెండో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించి 922వ ర్యాంక్ సాధించారు.

రిజల్ట్స్ చూసి షాక్ అయ్యాను

తాను ఈ రిజల్ట్స్ చూసి షాక్ అయ్యానని సారిక చెప్పారు. నేను సివిల్స్ క్లియర్ చేయాలని ఆశించాను, తాను ఈ ఆనందాన్ని చెప్పడాని తన దగ్గర మాటలు లేవని అన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత సివిల్ సర్వీసెస్ ఎంచుకోవాలని నిర్ణయించుకున్నానని, తన కుటుంబం, స్నేహితులు, ఉపాధ్యాయుల మద్దతు కారణంగానే ఈ ఘటన సాధించినట్లు సారిక వెల్లడించారు. తన తల్లిదండ్రులే తనకు పెద్ద మద్దతును ఇచ్చారని చెప్పారు. వైకల్యంలో బాధపడుతున్న ఇతరుకు సందేశం ఇస్తూ పాలో కోయెల్హో రాసిన ”ఆల్కెమిస్ట్” పుస్తకం నుంచి ఒక ప్రసిద్ధ వ్యాఖ్యాన్ని చెప్పారు. ”మీరు నిజంగా ఏదైనా కోరుకున్నప్పుడు.. దానిని సాధించడంలో విశ్వం మొత్తం మీకు సాయం చేస్తుంది” అని అన్నారు.

తల్లిదండ్రుల సహకారంతోనే విజయం

పరీక్ష సమయంలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి ఆమె చెప్పారు. ప్రిలిమినరీ పరీక్షా కేంద్రం కోజికోడ్‌లో ఉందని, వికలాండులకు అనుకూలంగా సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. మెయిన్స్ పరీక్ష్ కోసం తిరువనంతపురం వెళ్లాల్సి వచ్చిందని, వారం రోజుల ప్రక్రియ కావడంతో ఆమె తన తల్లిదండ్రులతో అక్కడే అద్దె రూంలో ఉంటూ పరీక్షకు వెళ్లానని చెప్పింది. తన ఎగ్జామ్ కోసం ఖతార్‌లో పనిచేస్తు్న్న తన నాన్న తిరిగి వచ్చినట్లు చెప్పారు. రాతపరీక్షలో తనకు సాయం చేసేందుకు రైటర్ సాంయ తీసుకున్నట్లు చెప్పారు. తన ఇంటర్వ్యూ ప్రక్రియ ఢిల్లీలోని కేరళ హౌజ్‌లో జరిగిందని చెప్పారు. అయితే, ఐదుగురు సభ్యులు ఉన్న ఇంటర్వ్యూ ప్యానెల్ ఎంతో ఫ్రెండ్లీగా వ్యవహరించారని చెప్పారు. తన గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్, కోజికోడ్ గురించి అడిగారని, కరెంట్ అఫైర్స్ గురించి తక్కువ ప్రశ్నలు ఉన్నాయని సారిక తెలిపారు.