Thursday, December 26, 2024
Homeఆరోగ్యంషుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

Date:

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. 45 ఏండ్లు పైబడిన 25,713 మందిని పదేండ్ల పాటు పరిశీలించామని వారు తెలిపారు. వీరంతా టైప్‌ 1 లేదా టైప్‌ 2 డయాబెటిస్‌తో బాధ పడుతున్నవారేనని చెప్పారు.

వీరిలో 44 శాతం మంది పురుష రోగుల్లో గుండె సంబంధిత సమస్యలున్నాయని, మహిళా రోగుల్లో ఇది 31 శాతంగా ఉందని చెప్పారు. కిడ్నీలు, కాళ్ల సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగినవారు పురుష డయాబెటిక్‌ రోగులు 55 శాతం ఉండగా, మహిళా రోగుల్లో 47 శాతం ఉన్నారు. పురుష రోగులకు 14 శాతం ఎక్కువగా కంటి చూపు సమస్యలు వచ్చే అవకాశముందని పరిశోధకులు పేర్కొన్నారు.