Friday, December 27, 2024
Homeక్రైం17ఏళ్ల నాటి హత్య కేసులో 14మందికి జీవిత ఖైదు

17ఏళ్ల నాటి హత్య కేసులో 14మందికి జీవిత ఖైదు

Date:

17ఏళ్ల కింద జ‌రిగిన ఒక హ‌త్య కేసులో బదౌనీలో ప్రత్యేక కోర్టు జడ్జి సంచలన తీర్పు ఇచ్చారు. 14 మందికి జీవిత ఖైదు, జరిమానా విధించారు. వీరిలో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌ జిల్లా ఖర్కౌల్‌ గ్రామంలో పాన్‌ సింగ్‌ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో వీరంతా దోషులుగా తేలడంతో ప్రత్యేక జడ్జి రేఖా శర్మ వారందరికీ శిక్షలు ఖరారు చేశారు. వీరిలో ఆరుగురికి రూ.50వేలు, ఎనిమిది మంది దోషులకు రూ.30వేలు చొప్పున జరిమానా విధించారని ప్రభుత్వం తరఫు న్యాయవాది వెల్లడించారు.

2007 ఫిబ్రవరిలో కరీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఖార్కౌల్‌ గ్రామంలో రాధేశ్యామ్‌ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జరిగిన ఎనిమిది రోజుల తర్వాత అతడి కుటుంబసభ్యులు, బంధువులు పాన్‌ సింగ్‌ ఇంటిపై దాడి చేశారు. పోలీసులకు బాధిత కుటుంబం చేసిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. పాన్‌సింగ్‌ ఇంటి వద్ద బహిరంగ కాల్పులు జరపడంతో పాటు కర్రలతో దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. ఆ తర్వాత అతడిని గొడ్డలితో నరికి చంపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. 12 మందిపై దోపిడీ, హత్య కేసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరో నలుగురిపైనా ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. కేసు విచారణలో ఉండగానే వీరిలో ఇద్దరు మరణించారు. తాజాగా ఈ కేసు తుది విచారణలో రాధేశ్యామ్‌ సోదరుడు ఉర్మాన్‌తో పాటు 14మందిని దోషులుగా నిర్ధారించి వారందరికీ జీవిత ఖైదు విధిస్తూ జడ్జి రేఖా శర్మ తీర్పు ఇచ్చారు. దోషులం