Saturday, September 28, 2024
Homeక్రైంసౌదీలో ఇద్దరు హైదరాబాద్ మహిళలు మృతి

సౌదీలో ఇద్దరు హైదరాబాద్ మహిళలు మృతి

Date:

హైదరాబాదీకి చెందిన ఇద్దరు మహిళలు సౌదీ అరేబియాలోని దమ్మామ్ నుంచి పవిత్ర నగరమైన మక్కాకు వెళ్తుండగా కారు ప్రమాదంలో మరణించారు. ఇద్దరు సోదరులు, వారి భార్యలతో కలిసి ఈద్ ప్రార్థనలు చేసేందుకు మక్కాకు వెళుతుండగా, రియాద్-మక్కా హైవేపై అఫీఫ్ సమీపంలో వారి కారును మరో కారు ఢీకొనడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. ఏప్రిల్ 8న ఈ ప్రమాదం జరిగింది.

మృతులను దమ్మాంలోని ఓ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఫర్హత్ అంజుమ్ హుస్సేనీ, ఆమె కోడలు రషీదా ఫరూఖీ అనే గృహిణిగా గుర్తించారు. వారి మృతదేహాలను అఫీఫ్‌లోని మార్చురీలో ఉంచారు. ఫర్హత్ అంజుమ్ షహబుద్దీన్ ఫారూఖీ భార్య, రషీదా ఫరూఖీ రఫీయుద్దీన్ ఫరూఖీ భార్య. అన్నదమ్ములిద్దరూ చాలా ఏళ్లుగా దమ్మామ్‌లో పనిచేస్తున్నారు. ఈద్ సెలవుల కారణంగా, అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయడంలో జాప్యం జరిగిందని, దీంతో అంత్యక్రియలు ఆలస్యమవుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

మృతదేహాలను హైదరాబాద్ తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మరో ఘటనలో భారతీయ విద్యార్థి కెనడాలో హత్యకు గురయ్యాడు. భారత విద్యార్థి తన ఆడి కారులోనే శవమై కనిపించాడు. అతనిపై కాల్పులు జరిపి చంపినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 12 రాత్రి 11 గంటల ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్దం వచ్చినట్లు స్థానికులు చెప్పారు. మృతుడిని చిరాగ్‌ ఆంటిల్‌ గా గుర్తించారు. ఈ మధ్య విదేశాల్లో భారతీయ విద్యార్థుల హత్యలు పెరిగిపోతున్నాయి. చిరాగ్‌ మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు అతని కుటుంబం కౌండ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ గోఫండ్‌ ద్వారా డబ్బును సేకరిస్తున్నట్లు తెలిసింది. .