ఇద్దరు బాలురు రైల్వే ట్రాక్‌పై కూర్చొని పాటలు వింటుండగా రైలు దూసుకొచ్చి ఢీ కొట్టడంతో మృతిచెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌దేపుర్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు సమీర్ (15), జాకీర్ అహ్మద్ (16) ఆదివారం సాయంత్రం ఇయర్‌ఫోన్‌లు పెట్టుకుని, రైల్వే ట్రాక్ మీద కూర్చొని పాటలు వింటున్నారు. అదే సమయంలో పట్టాలపై దూసుకొచ్చిన రైలు ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పట్టాలపై మృతదేహాలను గుర్తించిన సిబ్బంది రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇద్దరూ చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవడం వల్ల వారికి రైలు శబ్దం వినిపించకపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.