Thursday, September 19, 2024
Homeక్రైంమొబైల్ ఫోన్లు దొంగిలించడానికి శిక్షణ

మొబైల్ ఫోన్లు దొంగిలించడానికి శిక్షణ

Date:

మొబైల్ ఫోన్లు ఎలా కొట్టేయాలి.. ఏయే ప్రాంతాల్లో దొంగతనం చేస్తే దొరకరు.. ఎలాంటి వ్యక్తులను ఎంచుకోవాలి అనే విషయాలపై 45 రోజులు శిక్షణ ఇస్తారు.. శిక్షణలో దొంగతనం బాగా చేస్తున్నాడు అని నిర్థారించుకున్న తర్వాత ప్రతినెలా 25 వేల జీతంతో ఉద్యోగం ఇస్తారు. ఇందులో కూడా ప్రతినెలా టార్గెట్స్ ఉంటాయి.. టార్గెట్ రీచ్ అయితే జీతం మాత్రమే ఇస్తారు.. ఎక్కువ మొబైల్ ఫోన్లు కొట్టేస్తే మాత్రం బోనస్ లు ఇస్తారు.. ఇదంతా మన గుజరాత్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మొబైన్ ఫోన్ దొంగలు అయిన అవినాష్, శ్యామ్ లను పట్టుకోగా.. పోలీస్ విచారణలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి.

మొబైల్ ఫోన్లు దొంగించి బంగ్లాదేశ్, నేపాల్ లకు ఎగుమతి చేస్తున్న ఇద్దరు దొంగలను సూరత్ సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.. పోలీసులు విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. పట్టుబడిన ఇద్దరు నెలకు 25 జీతంలో, 45 రోజుల ట్రైనింగ్ తర్వాత వృత్తిలోకి దిగుతారు. దొంగిలించిన మొబైల్ ఫోన్లను అన్ లాక్ చేసి బంగ్లాదేశ్, నేపాలలకు సరఫరా చేస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు అవినాష్ మహతో(19), శ్యామ్ కుర్మీ (26) లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 58 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో 29 ఐఫోన్లు, 9 వన్ ఫ్లస్ ఫోన్లు ఉన్నాయి. రీకవరీ చేసిన ఫోన్ల మొత్తం విలువ రూ.20.60 లక్షలు ఉంటుందని దర్యాప్తు అధికారులు తెలిపారు.

అవినాష్, శ్యామ్లు జార్ఖండ్లో కూలీలుగా పనిచేస్తున్నారు. అవినాష్ అన్న పింటూ మహతో, రాహుల్ మహతో గుజరాత్ లో మొబైల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడి, దొంగిలించిన ఫోన్ లను అన్ లాక్ చేసి నేపాల్, బంగ్లాదేశ్ లకు పంపేవారు. రాహుల్ , పింటూలు అవినాష్, శ్యామ్ లను తమ వద్ద పనిచేయాలని ఫోన్లు దొంగించేందుకు సహకరించాలని, ఇందుకు నెలకు 25 వేల జీతం ఇస్తామని చెప్పారు. రద్దీ గా ఉంటే ప్రదేశాల్లో ఫోన్లను ఎలా దొంగిలించాలి అని 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది.