టీనేజ్ బాయ్‌ని రేప్ చేసిన కేసులో ఒడిశాలోని కేంద్రపారా జిల్లాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. . ప్రత్యేక పోక్సో కోర్టు ఆ వ్యక్తికి 50వేల జరిమానా విధించింది. ఒకవేళ నిందితుడు ఆ డబ్బు చెల్లించకుంటే, అతనికి మరో రెండేళ్ల జైలుశిక్ష అమలు చేస్తారు.
2021లో టీనేజ్ బాలుడిని నిందితుడు రేప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గోవుల షెడ్‌కు తీసుకెళ్లి తన కుమారుడిని రేప్ చేసినట్లు తల్లి పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నది. 14 ఏళ్ల బాలుడికి అయిదు లక్షలు చెల్లించాలంటూ కూడా ఒడిశా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనోజ్ కుమార్ సాహూ తెలిపారు. నిందితుడిపై ఐపీసీ 377, 6 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు బుక్ చేశారు. పది మంది సాక్ష్యులను విచారించారు.