భారీ శబ్దంతో హారన్ కొడుతూ మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ సైలెన్స్‌ర్లను మార్చిన కారు డ్రైవర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి పదిన్నర ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లో అత్యంత వేగంతో కారు దూసుకువెళ్లడంతో పాటు భారీ శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కారును (టీఎస్ 08జీఎన్6528) అడ్డుకున్నారు. ఈ కారు 2008 మోడల్ హోండా సివిక్ కారు కాగా దాన్ని రీమోడలింగ్ చేయడంతో పాటు సైలెన్సర్లను, డోర్లను మార్చినట్లు గుర్తించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించడంతో పాటు ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడిన టోలీచౌకికి చెందిన డ్రైవర్ ఎండీ.అనీస్ ఆదిల్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.