స్కూల్ టీచర్లు మానసిక, శారీరకంగా హింసించడంతో కేరళలో ఏడవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి వారం క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కేసులో హోలీ ప్యామిలీ విజిటేసన్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన ఇద్దరు టీచర్లను బుక్ చేశారు. ఫిబ్రవరి 15వ తేదీన బాధితుడు ప్రజిత్ మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజున స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ కేసులో ఆ స్కూల్ పీఈటీతో పాటు మరో లేడీ టీచర్‌పై కేసు బుక్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 324, 75, జువెనైల్ జస్టిస్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేశారు. ఆ రోజున పీఈటీ టీచర్ పిల్లవాడిని కొట్టినట్లు తండ్రి పోలీసు ఫిర్యాదులో ఆరోపించాడు. మరో టీచర్ ఆ విద్యార్థిపై దుర్భాషలాడారు. ప్రజిత్, అతని ఫ్రెండ్ నీళ్లు తాగేందుకు బయటకు వెళ్లి మళ్లీ క్లాస్‌రూమ్‌కు వచ్చారు. అయితే ఆ సమయంలో ప్రజిత్‌ను ఓ టీచర్ తీవ్రంగా కొట్టారు. మరో టీచర్ ఆ విద్యార్థిని తిట్టారు.