Wednesday, October 2, 2024
Homeక్రైంమహారాష్ట్రలో బయటపడ్డ నోట్ల కట్టల గుట్టలు

మహారాష్ట్రలో బయటపడ్డ నోట్ల కట్టల గుట్టలు

Date:

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో నోట్ల కట్టల గుట్టలు వెలుగుచూశాయి. మూడు రోజుల పాటు జరిపిన సోదాల్లో రూ.170 కోట్ల విలువైన సొత్తును ఆదాయపన్ను విభాగం స్వాధీనం చేసుకుంది. అందులో 8 కేజీల బంగారం, రూ.14 కోట్ల నగదు ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలతో నాందేడ్‌లోని ఆర్థిక లావాదేవీలు జరిపే సంస్థలపై ఈ సోదాలు జరిగాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

పుణె, నాసిక్‌, నాగ్‌పుర్, పర్బని, ఛత్రపతి, శంబాజీనగర్‌, నాందేడ్‌కు చెందిన ఆదాయపన్ను విభాగం అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. 25 వాహనాల్లో వచ్చినవారు మే 10 నుంచి మే 12 వరకు ఆయా సంస్థలకు చెందిన పలు కార్యాలయాలతో పాటు యాజమాన్యానికి చెందిన వ్యక్తిగత నివాసాల్లోనూ సోదాలు చేశారు. నాందేడ్‌లో ఈ స్థాయిలో రైడ్స్ జరగడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో కోట్ల రూపాయిల సంపదను గుర్తించారు. దాంతో నిందితులపై అధికారులు తదుపరి చర్యలను ప్రారంభించారు. ఇదిలాఉంటే.. దొరికిన సొమ్మును లెక్కించడానికి 14 గంటల సమయం పట్టినట్లు సమాచారం. బస్తాల్లో ఉన్న డబ్బును బయటకు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.