Friday, September 20, 2024
Homeక్రైంభార్యకు రూ.30 లిప్‌స్టిక్‌ కొన్న భర్త

భార్యకు రూ.30 లిప్‌స్టిక్‌ కొన్న భర్త

Date:

తన భార్యకు రూ.30 విలువైన లిప్‌స్టిక్‌ను భర్త గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే అంత ఖరీదైన లిప్‌స్టిక్‌ భర్త కొనడంపై భార్య ఆగ్రహించింది. ఈ సందర్భంగా వారి మధ్య గొడవ జరుగడంతో అలిగి పుట్టింటికి వెళ్లింది. అలాగే భర్తపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు విడాకులు డిమాండ్‌ చేసింది. చివరకు పోలీసులు ఆ దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. విస్తూపోయే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో జరిగింది. ఎత్మాద్‌పూర్ ప్రాంతానికి చెందిన మహిళకు మధురకు చెందిన వ్యక్తితో రెండేళ్ల కిందట వివాహమైంది.

ఇటీవల ఆ వ్యక్తి తన భార్యకు రూ.30 విలువైన లిప్‌స్టిక్‌ను బహుమతిగా ఇచ్చాడు. అయితే దీని కోసం అతడు ఎక్కువగా ఖర్చు చేశాడంటూ భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. చౌకైన లిప్‌స్టిక్‌ ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించింది. ఈ అంశంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. మరోవైపు లిప్‌స్టిక్‌ వివాదంపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటి ఆర్థిక పరిస్థితిని అర్ధం చేసుకోకుండా అతిగా ఖర్చు చేస్తున్న భర్త నుంచి విడాకులు కోరింది. దీంతో భార్యాభర్తలను ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు పోలీసులు రప్పించారు. వారిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇకపై భార్య కోరిన విధంగా తక్కువ ఖరీదు లిప్‌స్టిక్‌ కొనుగోలు చేస్తానని భర్త భరోసా ఇచ్చాడు. దీంతో ఆ దంపతుల వివాదం సమసిపోయిందని పోలీసులు వెల్లడించారు.