తెలంగాణలో చోరీకి గురైన సెల్‌ఫోన్లు రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి జులై 25 వరకు 21,193 సెల్‌ఫోన్లు రికవరీ చేశారు.
ఫోన్ల దొంగతనాలను అరికట్టేందుకు టెలికమ్యూనికేషన్ల శాఖ సిఈఐఆర్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్‌ను గతడాది మే 17న దేశవ్యాప్తంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో దీన్ని 2023 ఏప్రిల్ నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని 780 పోలీస్ స్టేషన్లలో ఈ పోర్టల్ ద్యారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు చోరీకి గురైన 21,193 మొబైళ్లను రికవరీ చేయడంలో పోలీసులు విజయం సాధించారు. గత 8 రోజుల్లోనే 1000 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ప్రతిరోజు దాదాపు 82 మొబైళ్లను రికవరీ చేస్తున్నామని ఉన్నాతాధికారులు వెల్లడించారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు www.tspolice.gov.in లేదా www.ceir.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా పిర్యాదు చేయాలని కోరారు.