Thursday, September 19, 2024
Homeక్రైంపోలీస్ స్టేషన్‌లో వీఐపీ మారిపోయిన కోడి

పోలీస్ స్టేషన్‌లో వీఐపీ మారిపోయిన కోడి

Date:

పంజాబ్‌లో పుడితే ఇలా వీఐపీ కోడిలా పుట్టాలిరా అనే మాట ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తోంది. అయితే సాధారణంగా మమూళ్లు కోళ్లకు కాకుండా వీఐపీ కోళ్ల వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. పంజాబ్‌లోని భటిండా గ్రామంలోని ఓ కోడి ఇప్పుడు అదే ప్రాంతంలోని బటిండా పోలీస్ స్టేషన్‌లో వీఐపీ కోడిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో రహస్యంగా నిర్వహించే కోడి పందాలు లాగే పంజాబ్‌లో కూడా కోడి పందాలు నిర్వహిస్తారు. పంజాబ్‌లో కోడి పందాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కోడిపందాలకు ప్రసిద్ధి చెందిన ఈ కోడి పందాలు బటిండా గ్రామంలో నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే దాడి చేశారు. బటిండా గ్రామంలో అత్యధికంగా కోడి పందేలు నిర్వహించారు. పోలీసుల దాడితో పలువురు పరుగుతీశారు. కొందరు పందెం కోళ్లు తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. కోళ్ల పందాల నిర్వహకుడితో పాటు ముగ్గురు నిందితులు ఓ పందెం కొడి పోలీసులకు చిక్కింది.

కోడి పందాల నిర్వాహకుడు సహా ముగ్గురు నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. పందెం కోళ్ల నిర్వహకుడి దగ్గర ఉన్న12 ట్రోఫీలను స్వాధీనం చేసుకున్నారు.అరెస్టు అయిన నిందితుడు, ఒక కోడి, 12 ట్రోఫీలను పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఈ కోడికి భద్రత కల్పించాల్సిన పరిస్థితి పంజాబ్ పోలీసులకు ఎదురైయ్యింది. పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఈ కోడికి ధాన్యంతో సహా ఆహారం ఇస్తున్నారు. దీంతోపాటు పందెం కోడికి పోలీసులు షిఫ్టుల పద్దతిలో 24 గంటల భద్రత కల్పిస్తున్నారు. పంజాబ్‌లో పందెం కోళ్లకు చాలా డిమాండ్ ఉంది. రాత్రిపూట లేదా పోలీసుల కంట పడకుండా పందెం కోడిని ఎత్తుకుపోయే అవకాశం ఉందని, కోడి మిస్ అయితే కోర్టులో సమాధనం చెప్పలేమని తెలుసుకున్న పోలీసులు ఇప్పుడు షిఫ్టుల్లో ఆ పందెం కోడికి భద్రత కల్పించడం హాట్ టాపిక్ అయ్యింది.