Monday, October 7, 2024
Homeక్రైంఇలాంటి కొడుకు భూమి మీద బతకడం అవసరమా..

ఇలాంటి కొడుకు భూమి మీద బతకడం అవసరమా..

Date:

ఆస్తి తగాదాల కారణంగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన తల్లికి కొడుకు నిప్పంటించాడు. షాకైన పోలీసులు మంటలు ఆర్పి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్రంగా కాలిన గాయాలైన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భూమి వివాదం నేపథ్యంలో ఒక కుటుంబం ఖైర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ఒక మహిళ, ఆమె కొడుకు ఒక పక్కకు వెళ్లారు. ఆ మహిళ తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుంది. లైటర్‌తో నిప్పంటించుకుంటానని బెదిరించింది.

పోలీసులు ఆ మహిళ ప్రయత్నాన్ని అడ్డుకుకున్నారు. ఆమె చేతిలోని లైటర్‌ను లాక్కోగా అది కింద పడింది. అయితే మొబైల్‌ ఫోన్‌లో వీడియో రికార్డ్‌ చేస్తున్న మహిళ కుమారుడు వెంటనే కింద పడిన లైటర్‌ తీసుకున్నాడు. ఆ లైటర్‌తో తన తల్లికి నిప్పంటించాడు. మంటల్లో ఆమె కాలుతుండటాన్ని మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశాడు. మరోవైపు ఇది చూసి పోలీసులు షాక్‌ అయ్యారు. మంటల్లో కాలుతున్న ఆ మహిళను కాపాడేందుకు ప్రయత్నించారు. గోనె సంచులు కప్పి, మట్టి చల్లి మంటలు ఆర్పివేశారు. 40 శాతం కాలిన గాయాలైన ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ మహిళ మరణించింది.