Sunday, December 22, 2024
Homeక్రైంపెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వలేదని భర్తను పొడిచిన భార్య

పెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వలేదని భర్తను పొడిచిన భార్య

Date:

సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే ఏడ్వాలో నవ్వాలో తెలియని పరిస్థితి. అలాంటి ఓ సంఘటనే ఇది. వివాహ వార్షికోత్సవం సందర్భంగా తనకు బహుమతి ఇవ్వలేదని ఓ మహిళ నిద్రిస్తున్న తన భర్తను కత్తితో పొడిచింది. అతని కేకలు విన్న ఇరుగుపొరుగు వారొచ్చి చూస్తే అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక రాజదాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బెంగళూరులోని బెల్లందూర్‌ ఏరియాలో ఈ దంపతులు నివసిస్తున్నారు. భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత నెలలోనే వీరి వివాహ వార్షికోత్సవం. అయితే వివాహ వార్షికోత్సవ వేడుకలు జరగలేదు. దీంతో భార్యకు భర్త ఎలాంటి గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. దీంతో అప్పటి నుంచి కోపంతో రగిలిపోతున్న భార్య . ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బెడ్ పై నిద్రిస్తున్న భర్తను వంటగదిలోని కత్తితో పొడిచింది. భర్తకు తీవ్ర గాయాల కాగా నొప్పితో కేకలు వేశాడు. ఆ శబ్దాలు విని పొరుగింటి వాళ్లు పరుగెత్తికొచ్చి చూడగా..అతడి ఒళ్లంతా రక్తపు మరకలు ఉన్నాయి..భార్య చేతిలో కత్తి ఉంది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. భర్తను విచారించిన పోలీసులు భార్యని అదుపులోకి తీసుకున్నారు. తమ మ్యారేజ్‌ కంటే ముందు రోజే మా తాత చనిపోయాడని, ఆ బాధలో ఉన్న తాను మ్యారేజ్ డేను సెలబ్రేట్‌ చేసుకోవాలని అనుకోలేదని, అందుకే గిఫ్ట్‌ కొనలేదని ఆ భర్త చెప్పుకొచ్చాడు.