Monday, October 7, 2024
Homeక్రైంట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్క‌ర్ త‌ల్లి అరెస్ట్‌

ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్క‌ర్ త‌ల్లి అరెస్ట్‌

Date:

ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐఏఎస్ ఆఫీస‌ర్ పూజా ఖేద్క‌ర్ త‌ల్లి మ‌నోర‌మా ఖేద్క‌ర్‌ను అక్ర‌మ రీతిలో గ‌న్ క‌లిగి ఉన్న కేసులో ఆమెను పుణె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయిగ‌డ్ జిల్లాలోని రాయ్‌గ‌డ్ ఫోర్ట్ వ‌ద్ద ఓ లాడ్జ్‌లో మ‌నోర‌మ దాక్కుకున్నారు. గురువారం ఉద‌యం పుణె పోలీసులు ఆమెను క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. పుణె జిల్లాలోని ముల్సి గ్రామంలో ఓ భూ వివాదం విష‌యంలో రైతుల్ని గ‌న్‌తో బెదిరిస్తున్న మ‌నోర‌మ వీడియో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. వీడియో వైర‌ల్ అయిన త‌ర్వాత మ‌నోర‌మ‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్‌లో ఆమె భ‌ర్త దిలీప్ ఖేద్క‌ర్ పేరును కూడా జోడించారు.

దిలీప్ ఖేద్క‌ర్‌పై కూడా అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌భుత్వ ఆఫీస‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న రెండు సార్లు స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యారు.కోల్హాపూర్‌లో రీజిన‌ల్ ఆఫీస‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో 2018లో ఆయ‌న తొలి సారి స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యారు. విద్యుత్తు, నీటి స‌ర‌ఫ‌రాను రీస్టోర్ చేసేందుకు సామిల్ వ్యాపారుల వ‌ద్ద 50 వేల లంచం డిమాండ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇలాంటి ఆరోప‌ణ‌ల‌పైనే మ‌రో సారి 2022లో ఆయ‌న స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యారు. పూజా ఖేద్క‌ర్ .. 2023 యూపీఎస్సీ ఎగ్జామ్‌లో 841 ర్యాంక్ సాధించింది. అయితే శిక్ష‌ణ‌లో ఉన్న ఆమెపై అధికార దుర్వినియోగ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ప్ర‌స్తుతం ఆమె శిక్ష‌ణ‌పై స‌స్పెన్ష‌న్ విధించారు. ఓబీసీ కోటాపై సీటు సంపాదించడం, ప్రైవేటు ఆడీ కారుకు బీక‌న్ వాడ‌డం లాంటి ఆరోప‌ణ‌లు ఉన్నాయి.