Sunday, December 22, 2024
Homeక్రైంజైళ్లలో మహిళా ఖైదీలకు రక్షణ లేదు

జైళ్లలో మహిళా ఖైదీలకు రక్షణ లేదు

Date:

దేశంలోకి మహిళల జైల్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. దేశ వ్యాప్తంగా గత ఐదేళ్లలో 275 కస్టడీ రేప్‌ కేసులు నమోదయ్యాయి. జైలులో మహిళా ఖైదీలపై జరిగిన అత్యాచార కేసులకు సంబంధించి టాప్‌లో ఉత్తరప్రదేశ్‌ ఉండగా, తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్‌ ఉన్నది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్బీ) డేటా ప్రకారం 2017 నుంచి 2022 వరకు మొత్తం 275 కస్టడీ రేప్‌ కేసులు నమోదయ్యాయి. అయితే గత కొన్నేళ్లుగా ఈ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. 2017లో 89 కేసులు, 2018లో 60, 2019లో 47, 2020లో 29, 2021లో 26, 2022లో 24 కేసులు నమోదయ్యాయి.

2017 నుంచి మహిళలపై జరిగిన 275 కస్టోడియల్ రేప్ కేసుల్లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 92 కేసులు నమోదయ్యాయి. 43 కేసులతో మధ్యప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. కస్టడీలో ఉన్న మహిళలపై అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో పోలీసు సిబ్బంది, పబ్లిక్ సర్వెంట్లు, సాయుధ దళాల సభ్యులు, జైళ్లు, రిమాండ్ హోమ్‌ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది నిందితులుగా ఉన్నారు.