Sunday, December 22, 2024
Homeక్రైంకోటాలో మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

కోటాలో మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

Date:

రాజ‌స్థాన్ కోటాలో మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. చదువుల ఒత్తిడిలో చితికిపోతున్న‌ పలువురు విద్యార్ధులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 13 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకుని మరణించారు. గతేడాది ఏకంగా 30 మంది విద్యార్థులు ఇక్కడ సూసైడ్‌ చేసుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌ మథురలోని బర్సానాకు చెందిన పరశురామ్‌ (21) నీట్‌ పరీక్షకు సిద్ధమయ్యేందుకు వారం రోజుల క్రితం రాజస్థాన్‌లోని కోటాకు వచ్చాడు. అక్కడ ఓ గదిని అద్దెకు తీసుకుని కోచింగ్‌ క్లాసులకు హాజరవుతున్నాడు. అయితే, కొన్ని గంటల పాటు పరశురామ్‌ కనిపించకపోవడంతో ఇంటి యజమాని అనూప్‌ కుమార్‌ పోలీసులకు సమాచారం అందించాడు. బుధవారం సాయంత్రం సమయంలో పరశురామ్‌ను చివరిసారిగా చూశానని, ఆ తర్వాత నుంచి అతను కనిపించడం లేదంటూ అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో పోలీసులకు ఫోన్‌ చేసి యజమాని అనూప్‌ తెలిపాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరశురాం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు పరశురాం గది తలుపులు పగలగొట్టి చూడగా.. ఇంట్లో ఉరేసుకొని కనిపించాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.