ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టు అయి ఏడు రోజుల ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన కొడుకు, తల్లిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే కవితకు సెషన్స్ కోర్టు అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి లభించింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను 8 మంది కలవొచ్చు. వారిలో తల్లి శోభా, కుమారులు ఆదిత్య, ఆర్యతో పాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
శనివారం నాడు కేటీఆర్, హరీశ్‌రావు కవితను ఈడీ కార్యాలయంలో కలిసిన సంగతి తెలిసిందే. ఇక ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలంటూ, అంతవరకు ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్టు చేయొద్దు అంటూ గతేడాది దాఖలైన పిటిషన్‌ను కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు.