Wednesday, October 30, 2024
Homeక్రైంకవిత సీబీఐ కస్టడీకి మూడు రోజులు

కవిత సీబీఐ కస్టడీకి మూడు రోజులు

Date:

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ అరెస్ట్, సీబీఐ కస్టడీ పిటిషన్‌ను సవాల్ చేస్తూ ఆమె పిటిషన్‌లు వేయగా.. ఆ రెండు పిటిషన్లను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 15 వరకు సీబీఐ అధికారులు కవితను విచారించనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ కవితకు ఏప్రిల్ 23 వరకు జ్యుడిషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు పొడిగించింది. అప్పటి వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు ఎమ్మెల్సీ కవిత. ఆమె బయట ఉంటే కేసును ప్రభావితం చేస్తారని ఈడీ వాదించింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు…కవితకు జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడిగించింది.

మార్చి 15న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 26 నుంచి ఆమె తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మంగళవారంతో జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో.. ఆమెను కోర్టులో హాజరపరిచారు ఈడీ అధికారులు. ఈ క్రమంలో మరోసారి జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది కోర్టు. ఇక కవిత రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై ఈనెల 20న విచారణ జరగనుంది.