Wednesday, January 22, 2025
Homeక్రైంక‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

Date:

కర్ణాటక రాష్ట్రంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. యల్లాపుర సమీపంలో ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు సావనూర్‌ నుంచి యల్లాపుర సంతకు పండ్లను విక్రయించేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఉత్తర కన్నడ జిల్లాలోని సావనూర్‌ – హుబ్బళి రహదారిపై అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ట్రక్కు డ్రైవర్ మరొక వాహనానికి దారి ఇచ్చే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పి లోయలోకి దూసుకువెళ్లిందని తెలిపారు. ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను హుబ్బలిలోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.