Monday, December 23, 2024
Homeక్రైంక‌దులుతున్న కారులో బాలిక‌పై అత్యాచారం

క‌దులుతున్న కారులో బాలిక‌పై అత్యాచారం

Date:

ముగ్గురు యువ‌కులు బాలిక‌ను కిడ్నాప్ చేసి, కదులుతున్న కారులో ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో వ్యక్తి వీడియో రికార్డ్‌ చేశాడు. ఆ బాలికను బ్లాక్‌మెయిల్‌ చేయసాగారు. వారి మాట వినకపోడంతో ఆ వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఈ నేపథ్యంలో బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 13 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతోంది. ఏడాది కిందట చినూర్‌కు చెందిన ఒక యువకుడితో ఆమెకు స్నేహం ఏర్పడింది. అతడు తన ఇద్దరు స్నేహితులను ఆమెకు పరిచయం చేశాడు. దీంతో వారు సోషల్‌ మీడియాలో చాట్‌ చేసుకున్నారు.

జూన్‌ 1న బాలిక స్నేహితుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి కారులో వచ్చారు. ఆమెను పిలిపించి కారులోకి బలవంతంగా ఎక్కించారు. ఒక వ్యక్తి కారు డ్రైవ్‌ చేస్తుండగా వెనుక సీటులో ఉన్న బాలికపై ఆమె ఫ్రెండ్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. డ్రైవర్‌ పక్క సీటులో కూర్చొన్న మరో వ్యక్తి మొబైల్‌లో దీనిని రికార్డ్‌ చేశాడు. అనంతరం నిందితుడు వీడియో చూపించి ఆ బాలికను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. ఆమె మాట వినకపోవడంతో ఆ వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. మరోవైపు ఇది తెలుసుకున్న బాధిత బాలిక జరిగిన సంఘటనను తన కుటుంబానికి చెప్పింది. కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తితో పాటు అతడి స్నేహితుడ్ని అరెస్ట్‌ చేశారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. నిందితులంతా 18 నుంచి 20 ఏళ్ల యువకులని పోలీస్ అధికారి వెల్లడించారు.