Monday, December 23, 2024
Homeక్రైంఇద్దరు చిన్నారులను చంపిన యువకుడు

ఇద్దరు చిన్నారులను చంపిన యువకుడు

Date:

ఇద్దరు చిన్నారులను ఓ యువకుడు గొడ్డలితో నరికి చంపాడు. మార్చి 19వ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో బదాయూలోని బాబా కాలనీలో మహ్మద్ షాదీద్ అనే వ్యక్తి పక్కనే ఉంటున్న వినోద్ ఇంట్లోకి ప్రవేశించాడు. వినోద్ భార్యని టీ చేయాలని అడిగాడు… తెలిసిన వ్యక్తే కదా అని ఆమె ఇంట్లోకి వెళ్లగా…పక్కనే ఆడుకుంటున్న ఆయుశ్, యువరాజ్, అహాన్ హానీలపై గొడ్డలితో అటాక్ చేశారు. యూపీలోని బదాయూలో ఈ డబుల్ మర్డర్ సంచలనం రేపింది.

ఈ ఘటనలో ఆయూశ్, అహాన్ హానీ అక్కడికక్కడే చనిపోయారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మరో చిన్నారి యువరాజ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పిల్లలను చంపిన కొద్ది గంటల వ్యవధిలోనే యువకుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇద్దరు పిల్లల హత్య నేపథ్యంలో బదాయూలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కోపంతో అక్కడి జనం షాపులకు నిప్పుంటించారు. అలర్ట్ అయిన పోలీసులు బదాయూలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఇద్దరు చిన్నారుల డెడ్ బాడీలను పోలీసులు పోస్ట్ మార్టంకి తరలించారు. అయితే హత్యకు గల కారణాలు తెలియలేదు. వ్యక్తిగత శత్రుత్వం కారణంగా షాదీద్ వారిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.