Thursday, December 26, 2024
Homeక్రైంఆవు పాలు పిండుతున్న వ్యక్తి హత్య

ఆవు పాలు పిండుతున్న వ్యక్తి హత్య

Date:

మనిషి ప్రాణం ఎప్పుడు ఏవిధంగా పోతుందో ఎవరికీ తెలియదు అంటుంటారు. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అది నిజమే అనిపిస్తుంది. తాజాగా బీహార్లో అలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలో ఆవుకు పాలుపిండుతూ హత్యకు గురయ్యాడు. బైకుపై వచ్చిన ఇద్దరు దండగులు ఆయనను కాల్చిచంపి పారిపోయారు. ఈ ఊహించిన పరిణామానికి స్థానికులు షాకయ్యారు. బీహార్‌ రాజధాని పట్నాలోని దనపూర్‌ ఏరియాలో ఝలన్‌ రాయ్‌ అనే 44 ఏళ్ల వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం కూడా అతడు ఇంటి ఆవరణలో తన ఆవుకు పాలు పిండుతున్నాడు. అదే సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైకుమీద వచ్చి అతడిని కాల్చిచంపారు. దుండగులు ఎవరో తెలియదు. ఎందుకు చంపారో తెలియదు.

ఈ హఠాత్పరిణామానికి స్థానికులు ఖంగుతిన్నారు. దుండగులు ఇళ్లలో ఉన్న వాళ్లను కాల్చిచంపుతున్నా రక్షణ కరువైందని ఆందోళనకు దిగారు. ఝులన్‌ రాయ్‌ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. రోడ్లపై టైర్లను కాల్చి నిరసన తెలిపారు. దాంతో దనపూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికుల ఆందోళనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.