ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లాలో ఇటీవల ఇద్దరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఈ దారుణం జరిగిన తర్వాత ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా బాధితురాళ్లలో ఒకరి తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. కాన్పూర్‌లోని ఘతంపూర్ ప్రాంతంలో ఇసుక బట్టీలో సాహూహిక అత్యాచారానికి గురైన వ్యక్తి కూతురు, మేనకోడలు కూడా ఆత్మహత్యకు పాల్పడిన కొన్ని రోజుల తర్వాత 45 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ బాలికలకు బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబం ఆరోపించిన నేపథ్యంలో ముగ్గురు నిందితులపై కాన్పూర్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ లోని పలు సెక్షన్ల కింద అరెస్టు చేశారు.
గ్యాంగ్ రేప్ కేసులో ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని బాధితురాలి తండ్రిపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బుధవారం అర్థరాత్రి ఒక చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హమీర్‌పూర్ ఎస్పీ మాట్లాడుతూ.. ఆత్మహత్యకు కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. కాన్పూర్ అత్యాచార ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఎక్స్ వేదికగా యోగి సర్కార్‌పై మండిపడ్డారు. ”కాన్పూర్‌లో సామూహిక అత్యాచారానికి గురైన ఇద్దరు మైనర్ బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఆ బాలికల తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబంపై రాజీకి వత్తిడి తెస్తున్నారు” అని మండిపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ బాధిత బాలికలు, మహిళలు న్యాయం కోసం అడగాలని, ఉన్నావ్, హత్రాస్, కాన్పూర్ వరకు ఎక్కడ స్ట్రీలు హింసించబడ్డారో , వారి కుటుంబాలు కూడా నాశనం చేయబడ్డాయి., చట్టం అనేది లేకండా జంగిల్ రాజ్‌లో స్ట్రీలు ఉండటం నేరంగా మారింది అని ఎక్స్ వేదికగా ఆరోపించారు.