Wednesday, January 15, 2025
Homeక్రైంసైబ‌ర్ నేర‌గాళ్ల కోసం బ్యాంకు ఖాతాలు

సైబ‌ర్ నేర‌గాళ్ల కోసం బ్యాంకు ఖాతాలు

Date:

సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్ర‌తి అవ‌కాశాన్ని వాడుకుంటూ అందినంత దండుకుంటున్నారు. అలాంటిది సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన కేసులో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. షంషేర్‌గంజ్‌ ఎస్‌బీఐ మాజీ మేనేజర్‌ మధుబాబు, సందీప్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

షంషేర్‌గంజ్‌ ఎస్‌బీఐకి చెందిన ఆరు ఖాతాల నుంచి రెండు నెలల్లో రూ.175 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. బ్రాంచ్‌ మేనేజర్‌ మధుబాబు ఆరుగురు క్యాబ్‌, ఆటో డ్రైవర్లకు కరెంట్‌ అకౌంట్లు తెరిచినట్లు పోలీసులు తెలిపారు. మహ్మద్‌ షోయబ్‌ అనే వ్యక్తి ఖాతాలు తెరిపించి ఖాతాదారులకు రూ.20 నుంచి రూ.30వేల వరకు, మధుబాబుకు కమీషన్లు ఇచ్చినట్లు చెప్పారు. ఈ కేసులోనే రెండ్రోజుల కిందట మహ్మద్‌ షోయబ్‌, అహ్మద్‌ బవజీర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.